Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీకే అరుణ పై నాగం జనార్ధనరెడ్డి ఫిర్యాదు

పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ ను మంత్రి డీకే అరుణ అక్రమంగా క్రషర్ కు తరలిస్తున్నారని ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఈ రోజు హైదరాబాద్ లో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగం, నీలి కిరోసిన్ అక్రమవాడకంపై అరుణ నైతిక బాధ్యత వహిస్తూ, మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే మంత్రిమండలి నుంచి తక్షణమే ఆమెను ముఖ్యమంత్రి తొలగించాలని డిమాండు చేశారు. కాగా, తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదన్న ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టీస్ కట్జూ మాటలను నాగం ఖండించారు. తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. వెంటనే కట్టూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నాగం డిమాండు చేశారు.

More Telugu News